సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించండి

సైబర్
Headlines in Telugu:
  1. సైబర్ నేరాల పెరుగుదలపై జాగ్రత్త సూచన – ఖమ్మం ఏసిపి ఫణిందర్
  2. వ్యక్తిగత సమాచార భద్రతపై ఖమ్మం సైబర్ క్రైమ్ ఏసిపి చైతన్య కార్యక్రమం
  3. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ACP ఫణిందర్ సూచన
  4. సైబర్ నేరాలను అరికట్టేందుకు విస్తృత సూచనలు – విశ్రాంత ఉద్యోగుల సమావేశం

*విశ్రాంత ఉద్యోగుల సమావేశంలో ఖమ్మం సైబర్ క్రైమ్ ఏసిపి ఫణిందర్ పిలుపు.*

ఖమ్మం : ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన విశ్రాంత ఉద్యోగుల సదస్సులో ముఖ్యఅతిథిగా ఖమ్మం సైబర్ క్రైమ్ ఎ సి పి ఫణిందర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనుషుల బలహీనతే నేరాలకు కారణం అవుతుందని ప్రతిరోజు మనం వినియోగిస్తున్న మొబైల్ ద్వారా అనేక విషయాలు బహిర్గతం అవుతున్నాయని ఇంటర్నెట్ వినియోగం పట్ల జాగ్రత్త లేకపోతే మోసాలకు గురవుతారని అన్నారు . వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని మాస్క్డ్ ఆధార్ వినియోగించాలని రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల విశ్రాంత ఉద్యోగులు మరింత జాగ్రత్త వహించాలని తెలిపారు . నిరుద్యోగులు చాలామంది సైబర్ బానిసలుగా మారుతున్నారని వారి ద్వారా సమాచారం తీసుకుని ఇతర దేశాల వారు దోపిడీకి సిద్ధమవుతున్నారని ముఖ్యంగా కంబోడియా వియత్నాం చైనా నేపాల్ తదితర దేశాల నుండి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు . వాట్సాప్ కాల్ మాట్లాడేటప్పుడు తగినంత జాగ్రత్త వహించాలని అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ విషయంలో కొంత గోపిక పాటించాలని కుటుంబ వివరాలు పొందుపరచటంలో కొన్ని మెలకువలు పాటించాలని లేనిచో ఇబ్బందులు తప్పవని అన్నారు . వ్యక్తిగత వివరాలు ఫోటోలు లేదా పండుగలకు పంపి ఆకర్షణీయమైన మెసేజ్లు ఇబ్బందులకు కారణం అవుతాయని అన్నారు . తెలియని నెంబర్ నుండి వచ్చిన కాల్స్ ను తీసుకోవద్దని సిమ్ కార్డులను ఎక్కడపడితే అక్కడ తీసుకోవద్దని అన్నారు. సైబర్ నేరం జరిగినప్పుడు 1930 కి వెంటనే కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా సమాచారాన్ని వెంటనే తెలిపినచో సంబంధిత కేసు పరిష్కరించడానికి వీలవుతుందని అన్నారు . ముందుగా భయాన్ని వీడి దురాశకు పోకుండా మొబైల్ ను అవసరం ఉన్నంత మేరకే వినియోగిస్తూ ఇంటర్నెట్ వినియోగాన్ని తగ్గిస్తూ అపరిచిత కాల్స్ తో జాగ్రత్త వహించడం ద్వారా కొంతవరకు సైబర్ నేరాలను అరికట్టవచ్చని అందుకు ప్రతి ఒక్కరూ మొబైల్ వినియోగం పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుబ్బయ్య. జిల్లా కార్యదర్శి తాళ్లూరు వేణు , ఉపాధ్యక్షులు ఎం జనార్ధన్ , కోశాధికారి డీకే శర్మ , నాయకులు సాంబశివరావు , నగర శాఖ నాయకులు బసవరావు , రాధాకృష్ణ , కృష్ణమూర్తి , రమేష్ , ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now