సైబర్ కేటుగాళ్లు ప్రమాదం

పొంచి వున్న సైబర్ కేటుగాళ్ల ప్రమాదం కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహ్మాన్
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 24
కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహమాన్ బుధవారం సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలని ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ ఆయన సందర్భంగా రైతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ఇదే అదునుగా భావించి సైబర్ కేటుగాళ్లు రైతుల అకౌంట్లను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని ప్రతి రైతు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కాబట్టి మీకు ఏదైనా వాట్సప్ ద్వారా గుర్తు తెలియని మెసేజ్లు వచ్చిన, ఓటీపీలు వచ్చిన ఎవరితో పంచుకోకుండా ఉండగలరు.

ఏదైనా సైబర్ బారిన పడితే టోల్ ఫ్రీ నెంబర్ 1930 లో ఫిర్యాదు చేయవలసిందిగా కోరారు.

Join WhatsApp

Join Now