2024 వార్షిక నివేదికను వెల్లడించిన సైబరాబాద్  కమిషనర్ అవినాష్ మహంతి…

2024 వార్షిక నివేదికను వెల్లడించిన సైబరాబాద్

కమిషనర్ అవినాష్ మహంతి…

సైబర్ నేరాలపై అనునిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం..

*(ప్రశ్న ఆయుధం),డిసెంబర్, 24:,శేరిలింగంపల్లి, ప్రతినిధి*

సైబర్ నేరాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార్షిక నివేదికను విడుదల చేశారు.

సాంప్రదాయ కేసులు తగ్గి సైబర్ నేరాలు, ఎకనామిక్స్ కేసులు పెరిగాయని ఆయన తెలిపారు. ప్రధానంగా డిజిటల్ అరెస్ట్ కేంద్రంగా సైబర్ నేరాలు పెరుగుతూ ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రజల అమాయకత్వాన్ని ఆశను పెట్టుబడిగా సైబర్ నేరగాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. కమిషనర్ పరిధిలో ట్రాఫిక్ నిర్వహణ గతం కంటే పూర్తిగా మెరుగుపడిందని గతంలోని జరిగిన ప్రమాదాలు ఈ సంవత్సరం తగ్గించడంలో పూర్తిగా ట్రాఫిక్ పోలీసులు పనిచేశారని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణలో జిహెచ్ఎంసి ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఐటీ కార్డులో ట్రాఫిక్ నిర్వహణలో ముందుకు వెళ్తామని తెలిపారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అనేక అంతర్జాతీయ సెమినార్లు సమావేశాలు నిర్వహించారు.

ఈ సమావేశంలో మాదాపూర్ డిసిపి వినీత్, మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి , బాలానగర్ కే సురేష్, రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్, క్రైమ్ డిసిపి నరసింహ, ఉమెన్ సేఫ్టీ వింగ్ సృజన కర్ణం, ఈఓడబ్ల్యుడిసిబి కే ప్రసాద్, సైబరాబాద్ క్రైమ్ డిసిపి బి శ్రీ బాల డిసిపి స్పెషల్ బ్రాంచ్ సాయి శ్రీ రోడ్ సేఫ్టీవింగ్ డిసిపి ఎల్ సి నాయక్ మేడ్చల్ ఎస్సోటి డిసిపి శ్రీనివాస్ మాదాపూర్ ఎస్ఆర్టీ డిసిపి శోభన్ కుమార్ సైబరాబాద్ హెడ్ క్వార్టర్ డిసిపి సంజీవ్ మాదాపూర్ ట్రాఫిక్ డిసిపి సాయికుమార్ మాదాపూర్ ఎల్ఎన్హెచ్ఓ అడిషనల్ డీసీపీ జయరాం మాదాపూర్ ట్రాఫిక్ అడిషనల్ మాదాపూర్ ట్రాఫిక్ అడిషనల్ డిసిపి శివకుమార్ మేడ్చల్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వీరన్న హెడ్ క్వార్టర్స్ అడిషనల్ డిసిపి ఎస్కే షామీర్ అడిషనల్ డిసిపి అడ్మిన్ రవిచందన్ రెడ్డి ఎస్ బి అడిషనల్ డిసిపి రవికుమార్ బాలనగర్ ఎల్ఎన్ఓ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now