*బంగాళాఖాతంలో వాయుగుండం.. ఎల్లుండికి తుఫాన్.. ఏపీకి భారీ వర్ష సూచన..!!*
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారనుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.దీని ప్రభావంతో మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు ఏపీ, తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని (Rains), ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొన్నారు.
కాగా వాయుగుండం తీరం దిశగా వచ్చే సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున … వరి పంటను కోసే రైతులు అప్రమత్తంగా ఉండాలని,…లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి ఉండే నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు, శ్రీలంక వైపు కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో బుధవారం ( 27 ) నుంచి శని వారం వరకు (29) వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం నవంబర్ 27కల్లా తమిళనాడు, శ్రీలంక తీరాల దిశగా రానున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది తుఫానుగా బలపడుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో వచ్చే నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణం శాఖ హెచ్చరించింది.
.ఐఎండీ, జీఈపీఎస్ ప్రకారం ఆదివారం రాత్రికి వాయుగుండంగా మారి 26 వ తేది సాయంత్రానికి బలపడుతుంది. తరు వాత మయన్మార్ వైపు గా వెళుతుంది. ఎన్సీఈపి మోడల్ ప్రకారం కూడా వాయు గుండంగా బలపడిన తరువాత 27 వరకు పశ్చిమ వాయువ్యంగా పయనించి, మయన్మార్ వైపు మళ్లుతుంది. ప్రస్తుతం ఖరీఫ్‌లో రాష్ట్రం అంతటా వరి దండిగా పండింది. కోతలు సాగుతున్నాయి. రబీ పంటలు మొలక మొక్క దశలో ఉన్నాయి. ఈ తరుణంలో భారీ వర్షాలు కురిస్తే నష్టం పోయే అవకాశాలున్నాయని రైతులు వాపోతున్నారు.
వాతావరణ శాఖ తెలిసిన వివరాల ప్రకారం.. సోమ, మంగళ ( 26,26) వారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తరకోస్తాలో ఒకటి, రెండుచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 27, 28 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో, 29న విశాఖ, అనకాపల్లి, కాకినాడ. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.