ఏపీ మెగా డీఎస్సీలో 75వ ర్యాంకు సాధించిన రోజువారీ కూలీ

ఏపీ మెగా డీఎస్సీలో 75వ ర్యాంకు సాధించిన రోజువారీ కూలీ

అంబేద్కర్ కోనసీమ జిల్లా :

ఏపీలో ఏడు సంవత్సరాలుగా రోజువారీ కూలి పనులు చేస్తూ జీవనం సాగించిన చాట్ల రత్నరాజు మెగా డీఎస్సీలో విజయకేతనం ఎగురవేశారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక శివారు కాట్రగడ్డకు చెందిన రత్నరాజు 2014లో బి.ఈడీ పూర్తిచేసి, రెండు సార్లు డీఎస్సీ రాసి విఫలమయ్యారు. కుటుంబ పోషణ కోసం కూలి పనులు చేస్తూ ముగ్గురు పిల్లలను పెంచుతున్నారు. కష్టాల మధ్య చదువు వదలని రత్నరాజు ఈసారి 75వ ర్యాంకు సాధించి స్కూల్ అసిస్టెంట్ (సోషల్) టీచర్ పోస్టును పొందారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment