*విద్యుత్ తీగలు తగిలి పాడి గేదె మృత్యువాత*
మహబూబాబాద్ జిల్లా: గూడూరు మండలం రాములుతండా లో రాత్రి కురిసిన వర్షం కు విద్యుత్ తీగలు తెగి పడడం తో ఇదే గ్రామానికి చెందిన బానోత్ రాజేందర్ అనే రైతు కు చెందిన పాడి గేదె మేత మేస్తున్న క్రమంలో తెగి పడిన విద్యుత్ వైర్ తగిలి మృత్యువాత పడినట్లు రైతు తెలిపారు.90 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి గత కొన్ని రోజుల క్రితం మే ఈ గేదె ను కోనుగోలు చేసినట్లు, ఇప్పుడు 90 వేల రూపాయలు నష్టం వాటిల్లింది అని రైతు రాజేందర్ ఆరోపించారు.తనకు కలిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని అధికారులను కోరారు.