*రోడ్ ప్రమా దంలో ఇటీవలే గాయపడిన కురపాటి జయరావు ను
పరామర్శించిన డాకోట రాంబాబు*
మధిర/ఖమ్మం జిల్లా బ్యూరో. ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 4
మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన కూరపాటి జయరావు ఇటీవలే జరిగిన రోడ్ ప్రమాదంలో తలకి తీవ్ర గాయం కావడంతో ఖమ్మం లోని స్థంబాద్రి హాస్పిటల్ నందు బ్రెయిన్ ఆపరేషన్ అవ్వగా వారిని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డా.కోట రాంబాబు పరామర్శించారు. వారి రిపోర్ట్స్ అన్ని పరిశీలించి సంబంధిత వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూడాలి అని కోరారు.
రాంబాబు వెంట TAC సభ్యులు ఉమ్మినేని కృష్ణ, MRPS జిల్లా అధ్యక్షులు కూరపాటి సునీల్, మందడపు నాగేశ్వరరావు, నరసింహారావు తదితరులు ఉన్నారు….