మురికి కాలువ కు అడ్డంగా అక్రమంగా నిర్మించిన గోడను తొలగించాలని కలెక్టర్కు ప్రజావాణిలో వినతి
– మురికి కాలువ స్థలాన్ని కబ్జా చేసిన బిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్
ప్రశ్న ఆయుధం కామారెడ్డి
జిల్లా బిబిపేట మండలం జనగామ గ్రామంలో మురికి కాలువ స్థలాన్ని బిక్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు తో పాటు కుమ్మరి శ్రీనివాస్ అనే వ్యక్తులు కబ్జా చేయడమే కాకుండా అట్టి స్థలంలో అక్రమంగా గ్రామపంచాయతీ పరిమిషన్ లేకుండా మురికి కాల్వకు అడ్డుగా ప్రహరీ గోడ నిర్మించరని డాకూరి మోహన్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డాకూరి మోహన్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి హనుమయ్య సుమారు 50, 60 సంవత్సరాల క్రితం నిర్మించిన ( ఇంటి నెంబర్ 4-73 ) వంటి వెనకాల తన మురికినీరు వెళ్లడానికి గజం వెడల్పు 65 గజాల పొడవుతో అదే గ్రామానికి చెందిన మద్దూరి కృష్ణారెడ్డి వద్ద 25 సంవత్సరాలక్రితమే భూమిని కొనుగోలు చేశారన్నారు. ఈ ఇద్దరు కూడా అక్రమంగా నా మొరికి అడ్డుగా గోడ నిర్మించడంతో ఇంటిలో వర్షం నీటితో పాటు మురికినీరు నిలువ ఉండి తన ఇల్లు ఆ నీటితో తడిసి కూలిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటీవల గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనివాస్ భిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజులు అట్టి మురికి కాలువ స్థలాన్ని కబ్జా చేసి గ్రామపంచాయతీ పర్మిషన్ లేకుండా అక్రమంగా గోడ నిర్మించడంతో తన ఇంటిలో నీరు నిలిచి ఇల్లు కూలిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికార బలంతో భిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు తనను బెదిరింపులకు గురి చేస్తూ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కాబట్టి ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మోహన్ పత్రిక ముఖంగా అధికారులను కోరాడు. గ్రామపంచాయతీ పర్మిషన్ లేకుండా అక్రమంగా నిర్మించిన గోడను తొలగించి తన ఇంటికి రక్షణ కల్పించడంతోపాటు అక్రమలకు పాల్పడుతున్న భిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, కుమ్మరి శ్రీనివాసులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ వినతి పత్రంలో కోరడం జరిగిందన్నారు.