Site icon PRASHNA AYUDHAM

భారత రాజ్యాంగం సజీవ దస్తావేజు         — దళిత ఫాంథర్ నేత కీర్తి డోలే 

IMG 20250424 WA2193

*భారత రాజ్యాంగం సజీవ దస్తావేజు*

— దళిత ఫాంథర్ నేత కీర్తి డోలే

ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 24: గొప్ప సామాజిక కార్యకర్త జగదీష్ నగర్కర్ 4వ సంస్మరణ నిమిత్తంగా “75 ఏళ్ల భారత రాజ్యాంగం పురోగతి, ప్రస్తుత స్థితి, భవిష్యత్తు” అంశంపై సదస్సు జరిగింది. ఇందులో అర్.పి.ఐ నేత ప్రవీణ్ మోరే, బిఎంసీ మాజీ అధికారి నరేంద్ర పగారే, త్రిరత్న బౌద్ధ సమాఖ్యకు చెందిన ధమ్మచారి బోధిసేన్, మాజీ బిఎంసీ అధికారి ప్రకాష్ పాటిల్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య మార్గదర్శకులుగా బాంబే హైకోర్టు లాయర్, దళిత పాంథర్ నాయకులు కీర్తిబావు డోలే మాట్లాడుతూ భారత రాజ్యాంగం సజీవమైన దస్తావేజు అంటూ కొనియాడారు. స్వతంత్రం అనంతరం రాజ్యాంగం అవశ్యక్యత, జ్యుడీషియల్ రివ్యూ విశిష్టతలు, సుప్రిమసి ఆఫ్ కన్స్టిట్యూషన్, రాజ్యాంగ నైతికత అనే బహుముల్య అంశాలను సవిస్తరంగా వివరించారు. మరో గైడ్ ప్రొఫెసర్ జయమంగల్ ధనరాజ్ భారత రాజ్యాంగం 75ఏళ్ల పాటు దేశంలో చెక్కు చెదరకుండా బలంగా ఉండడానికి పలు కారణాలను చక్కగా వివరించారు. బుధవారం సాయంత్రం బాందిల్కి సామాజిక సంస్థ, రుణానుబంద్ అభియాన్ ల ఆధ్వర్యంలో దాదర్లోని నాయర్ హాల్లో సదస్సు నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షత ప్రమోద్ సావంత్ చేయగా, కమలాకర్ షిండే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. “బాందిల్కి” కార్యకర్తలైన రూపేష్ పురాల్కర్, ప్రదీప్ షిందే, సతీష్ నికల్జే, ప్రకాశ్ అశ్వేకర్, తుషార్ కాంబ్లే, మూలనివాసి మాలజీ పాల్గొన్నారు.

Exit mobile version