దళిత పక్షపాతి విప్లవ కిషోరం భగత్ సింగ్

*దళిత పక్షపాతి విప్లవ కిషోరం భగత్ సింగ్*

ప్రశ్న ఆయుధం మార్చి 23: భారతీయులపై ఎలాంటి దోపిడిలేమి, పీడన లేని, అణచివేతలు, మతం కులం లేని సమాసమాజ సాధకుడు స్వాప్నికుడు మన భగత్ సింగ్. కుల నిర్మూలనా పట్ల స్పష్టమైన అవగాహన కల్గిన యువ కిషోరం. దళితులు నిద్రిస్తున్న పులులు. దళితులే విప్లవానికి అగ్రగామిగా ఉండాలని ప్రతిపాదించిన నిజమైన విప్లవాది భగత్ సింగ్. అగ్రగామి అంటే దళితులకు నాయకత్వం ఆపాదించడం. దళితులు నాయత్వంలో ఉంటేనే కులనిర్మూలన సాధ్యమని అర్థం. “కొన్ని రోజులైతే తెల్ల దొరలు (బ్రిటిష్ వాళ్ళు) వెళ్ళి పోతారు, వారి చోటనే నల్ల దొరల (శెట్టోల్లు, భూస్వాముల) రాజ్యం వస్తుంది. తిరిగి నేను మీకు జ్ఞాపకం వస్తాను” అంటూ నిర్దిష్ట భవిష్యవాణి చేసిన నిజమైన మార్క్సిస్టు విశ్లేషకుడు భగత్ సింగ్. ఆయన కన్న కలలను, ఆశయాల్ని మనం నిజం చేసినప్పుడే నిజమైన నివాళి అంటూ అంబేడ్కర్ యువజన సంఘం (ఏ.వై.ఎస్) జిల్లా అధ్యక్షులు ఇత్వార్పేట్ లింగన్న చరిత్రను వివరించారు. ఏ.వైఎస్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం జిల్లా నిజమాబాద్ ఆర్మూర్ డివిజన్ లోని మామిడిపల్లి చౌరస్తా వద్దగల షహిద్ భగత్ సింగ్ విగ్రహనికి కార్యకర్తలందరు చేతులెత్తి నివాళి అర్పించారు. ఇందులో ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు మామిడి రాజు, జర్నలిస్ట్ గన్నారపు శంకర్, టీచర్ సంగెం అశోక్, సురేష్ వాగ్మారే, థోఫిక్ షేక్, సయ్యద్ జావేద్, సంతోష్ కుమార్, వీరు జాటవ్, అరుణ్ కుమార్, బ్రిజేష్ కుమార్, మూలనివాసి మాలజీ “భగత్ సింగ్ అమర్ రహే” నినాదాలిశారు.

Join WhatsApp

Join Now