*ప్రజావానిలో రెండో విడత దళిత బంధు రిలీజ్ చేయాలని దళితబందు సాధన సమితి వినతిపత్రం*
*హుజురాబాద్ డిసెంబర్30 ప్రశ్నఆయుధం:*
సోమవారం రోజున కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో దళితబందు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గ కమిటీ రెండవ విడత నిధులు మంజూరు చేయాలనీ కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు దళితబందు సాధన సమితి హుజురాబాద్ ఇంచార్జి కోలుగూరి సురేష్ మాట్లాడుతూ గత సంవత్సరం కాలం నుండి దళితబందు రెండవ విడత నిధులు మంజూరు చేయాలనీ అనేక సార్లు జిల్లా కలెక్టర్ కి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు అలాగే ఎంపీడీఓ లతో మొదలుకొని అధికారులను కాంగ్రెస్ పార్టీ పెద్దలు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కి సుమారుగా 10సార్లు వెళ్లి దళితబందు వచ్చేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగిందన అయిన కాంగ్రెస్ ప్రభుత్వం దళితబందు పై స్పందించడం లేదు రోడ్డెక్కి కార్యక్రమలు చేస్తే బాధితులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురించేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో దళితుల అగ్రహా జలలకు గురికావడం తథ్యం ఇప్పటికే దళితులు ప్రభుత్వంపై అగ్రహాంతో ఉన్నారని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ముందే హుజురాబాద్ నియోజకవర్గంలోని రెండవ విడత దళితబందు నిధులు మంజూరు చేసి దళితుల అభ్యున్నతికి తోడప్పడాలని లేనిపక్షంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పనితిరు అరుగ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం అయిందని ప్రతి గ్రామానికి వెళ్లి ప్రభుత్వన్ని ఎండగట్టే దిశగా ముందుకు వెళ్తాము అని ప్రభుత్వనికి హెచ్చరిస్తున్నాం కార్యక్రమంలో దళితబందు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గం కమిటీ సభ్యులు కోలుగూరి సురేష్ ఇనుగాల బిక్షపతి మహంకాళి రమేష్ సరిగోమ్ముల విజయ్ ఇల్లందుల రమేష్ రాము కృపకర్ మారాముళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు