Site icon PRASHNA AYUDHAM

నక్సల్స్‌ మూలాలపై దెబ్బ..

IMG 20250518 WA1500

*నక్సల్స్‌ మూలాలపై దెబ్బ..*

*మావోయిస్టుల రిక్రూట్‌మెంట్‌, సమాచారం, రవాణా, వనరులపై వేటు*

*10 ఏళ్లలో తగ్గిన నక్సలిజం*

*నక్సల్స్‌ స్థావరాల్లో కేంద్ర బలగాల పాగా*

*ప్రజలపై ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం*

*126 నుంచి 6 జిల్లాలకు పరిమితమైన నక్సలిజం*

*నక్సల్స్‌ హింస 81శాతం తగ్గు ముఖం*

గడిచిన పదేళ్లలో దేశంలో నక్సలిజం చాలా వరకు తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుడిచిపెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు గుర్తుచేసింది. ‘నేషనల్‌ పాలసీ అండ్‌ యాక్షన్‌ ప్లాన్‌’ పేరుతో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలతో నక్సల్స్‌ హింస 81ుమేర తగ్గడమే కాకుండా.. మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి 6కు చేరినట్లు వెల్లడించింది. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లో కేంద్ర బలగాలు క్యాంపులను ఏర్పాటు చేశాయని, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో చిన్నారులకు విద్య, యువతకు వృత్తి నైపుణ్యతలో శిక్షణ, రోడ్ల నిర్మాణం, 4జీ నెట్‌వర్క్‌తో సెల్‌ఫోన్‌ సౌకర్యం, పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు చేసినట్లు తెలిపింది. గత నెల 21నుంచి ఈ నెల 11వరకు తెలంగాణ-ఛత్తీ‌స్‌గఢ్‌-మహారాష్ట్ర సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో చేపట్టిన ఆపరేషన్‌లో 16మంది మహిళా నక్సల్స్‌ సహా.. 31 మంది మావోయిస్టులు హతమయ్యారని, ఆ ప్రాంతంలో కేంద్ర బలగాలు క్యాంపులను ఏర్పాటు చేసినట్లు వివరించింది. అదే సమయంలో మావోయిస్టుల రిక్రూట్‌మెంట్లు, కమ్యూనికేషన్‌, రవాణా, వనరులపై దెబ్బ కొట్టినట్లు పేర్కొంది. ఆయా వివరాలను ‘బ్రేకింగ్‌ రెడ్‌ గ్రిప్‌’ పేరుతో శనివారం ఓ నివేదికను విడుదల చేసింది. అందులోని కీలకాంశాలు..

2014లో 126 జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉండగా.. వాటి సంఖ్య 2018లో 90కి, 2021లో 70కి, 2024లో 38కి.. ప్రస్తుతం 12కి తగ్గింది. ఈ 12 జిల్లాల్లో ఆరింటిలో మాత్రం మావోయిజం తీవ్రంగా ఉంది. అవి.. ఛత్తీ‌స్‌గఢ్‌లోని బీజాపూర్‌, కాంకేర్‌, నారాయణపూర్‌, సుకుమా, ఝార్ఖండ్‌లోని వెస్ట్‌ సింగ్‌భూమ్‌, మహారాష్ట్రలోని గడ్చిరోలి

గడిచిన పదేళ్లలో 8 వేల మంది మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచిపెట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం 18 వేల చ.కి.మీ. నుంచి 4,200 చ.కి.మీ.కు తగ్గింది. 2010-24 మధ్య నక్సల్స్‌ హింస 81ు, నక్సల్స్‌ హింసలో మరణాలు 85ుమేర తగ్గాయి

2014లో 330 పోలీ్‌సస్టేషన్ల పరిధిలో మావోయిస్టుల హింసపై కేసులు నమోదవ్వగా.. 2024లో ఆ సంఖ్య 104కు తగ్గింది. 2004-14 మధ్యకాలంలో 16,463 మావోయిస్టుల హింస సంఘటనలు నమోదవ్వగా.. 2014-24 మధ్యకాలంలో 53ు మేర తగ్గి.. 7,744కు చేరుకున్నాయి. మావోయిస్టుల కాల్పులు, మందుపాతరల కారణంగా 2004-14లో భద్రతాబలగాలకు చెందిన 1,851 మంది మరణించగా.. 2014-24లో ఆ సంఖ్య 509కి చేరింది.

నక్సల్స్‌ ప్రాంతాల్లో చేపట్టిన పథకాలు

భద్రత ఖర్చుల(ఎ్‌సఆర్‌ఈ) పథకం ద్వారా రూ.3,260 కోట్ల ఖర్చు

ప్రత్యేక కేంద్ర సహాయం(ఎ్‌ససీఏ)కు రూ.3,563 కోట్ల కేటాయింపు

ప్రత్యేక మౌలిక వసతుల(ఎ్‌సఐఎస్‌) పథకం ద్వారా రూ.1741 కోట్లతో 221 పటిష్ఠ పోలీసు స్టేషన్ల నిర్మాణం. గడిచిన 10 ఏళ్లలో మొత్తం 612 పోలీ్‌సస్టేషన్ల ఏర్పాటు. అంతకు ముందు వీటి సంఖ్య 59

నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో 17,589 కి.మీ.రహదారుల నిర్మాణం లక్ష్యంలో.. 14,618 కి.మీ. పూర్తి

4జీ సేవల కోసం 10,505 సెల్‌ టవర్ల ఏర్పాటు లక్ష్యంలో.. 7,768 పూర్తి

35 జిల్లాల్లో 1,007 బ్యాంకులు, 937 ఏటీఎంలు, 5,731 పోస్టాఫీసుల ఏర్పాటు. ఈ జిల్లాల్లో 178 ఏకలవ్య మోడల్‌ స్కూళ్లు, 48 ఐటీఐలు, 61 నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు

ఆదివాసీ యువతకు ప్రత్యేక శిక్షణనివ్వడం ద్వారా.. 1,143 మంది భద్రతా బలగాల్లో నియమితులయ్యారు

మావోయిస్టు ప్రాంతాల్లో 302 క్యాంపుల ఏర్పాటు.

20 మంది నక్సల్స్‌ అరెస్ట్‌ 8 లొంగిపోయిన 8 మంది

ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన 20 మంది నక్సల్స్‌ పారిపోతూ వేర్వేరు చోట్ల చిక్కగా.. మరో 8 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. ములుగు ఎస్పీ శబరీష్‌ శనివారం వివరాలు వెల్లడించారు. ‘కర్రెగుట్టల్లో ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో కొందరు మావోయిస్టులు వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పటిష్ఠ బందోబస్త్‌ ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాం. శుక్రవారం వెంకటాపురం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని పాలెం ప్రాజెక్ట్‌ వద్ద ఆరుగురు మావోయిస్టులు, శనివారం ఉదయం వాజేడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతం వద్ద ఏడుగురు మావోయిస్టులు, కన్నాయిగూడెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చేపట్టిన పెట్రోలింగ్‌లో మరో ఏడుగురు పట్టుబడ్డారు. వీరి నుంచి తుపాకులు, గ్రనేడ్లు, మందుగుండు సామగ్రి, విప్లవ సాహిత్యం పుస్తకాలు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నాం. అలాగే సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది సభ్యులు లొంగిపోయారు. ప్రస్తుతం వీరికి రూ.25 వేల చొప్పున ఇస్తున్నాం.’ అని ఎస్పీ వివరించారు.

Exit mobile version