డీసీఎం వ్యాను ద్విచక్ర వాహనం మీద ఢీకొనగా వ్యక్తి మృతి
దమ్మపేట మండల ప్రతినిధి
దమ్మపేట నుండి పాల్వంచ మల్లారం రోడ్ , దమ్మపేట
మీదుగా వెళుతున్న డీసీఎం వ్యాను ద్విచక్ర వాహనదారున్ని ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు తెలియజేసిన సమాచారం ప్రకారం శేషగిరి నాగేశ్వరరావు సన్నాఫ్ ముత్తయ్య కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 5 నెలల క్రితం భార్యకు గుండెపోటుతో చనిపోయింది. నాగేశ్వరరావు హాస్పటల్ నిమిత్తం బయలుదేరగా ఈ ఘటన జరిగింది. స్థానిక దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి పోస్టుమార్టం నిమిత్తం పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.