బాలికల విద్యావంతులు అయితేనే సమాజంలో మార్పు: వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి ప్రతినిధి, మే 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): బాలికలు విద్యావంతులైతేనే సమాజంలో మార్పు వస్తుందని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సిఎస్ ఆర్ నిధుల నుంచి తోషిబా కంపెనీ ద్వారా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల జోగిపేట్ అందోల్ కు నూతన బస్సును జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో జండా ఊపి మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. బస్సులో విద్యార్థులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ క్రాంతి కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. సమాజంలో మార్పు రావాలంటే, సమాజం ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే, సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపాలంటే బాలికలు అత్యంత విద్యావంతులై ఉండాలన్నారు. నూతన బస్సును ప్రారంభించినందుకు విద్యార్థులు దామోదర్ రాజనర్సింహకు ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్, తోషిబా కంపెని ప్రతినిధులు, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now