దానం నాగేందర్ చట్టసభల్లో ఒక రౌడీంగా మాట్లాడడం సరికాదని

●దానం నాగేందర్ వ్యాఖ్యలకు సభ్య సమాజం సిగ్గుపడుతుంది ….

●మెదక్ జిల్లా ఎంపీపీల పోరం మాజీ అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ…..

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 3 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని ఏదుల్లాపూర్ గ్రామంలోని మెదక్ జిల్లా ఎంపీపీల పోరం మాజీ అధ్యక్షులు శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడిన మాటలకు సభ్య సమాజం సిగ్గు పడుతుందని . ఆయన బి ఆర్.ఎస్ లో ఉన్నంతకాలం క్రమశిక్షణగా ఉండేవారని కాంగ్రెస్ కండువా కప్పుకోగానే అపరిచితుడుగా మారి చట్టసభల్లో ఒక రౌడీంగా మాట్లాడడం సరికాదని త్వరలోనే ఆయనకు బి ఆర్ ఎస్ కార్యకర్తలు తగు గుణపాఠం చెప్తారని దానం నాగేందర్ ఖబర్దార్ అంటూ ఆయన మీడియాకు తెలిపారు

Join WhatsApp

Join Now