*కొమరాడలో ప్రమాదం: లారీ చక్రాల కింద నుజ్జునుజ్జైన వ్యక్తి*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏపీర్ల 13( ప్రశ్న ఆయుధం న్యూస్ )దత్తి మహేశ్వరావు
ప్రమాదవశాత్తు లారీ ఢీకొని ఆదివారం మూడు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి మృతి
కొమరాడ మండల కేంద్రంలో ఆదివారం మూడు గంటల ప్రాంతంలో ఘటన
కొమరాడ పంచాయతీ కొత్తవలస గ్రామానికి చెందిన బిడ్డిక లక్ష్మణ 57 సంవత్సరాలు లారీ టైర్ల కింద పడి నుజ్జు నుజ్జు అయిన పరిస్థితి
రాయగడ నుండి పార్వతిపురం వస్తున్న AP39 A 52 99 నెంబర్ గల లారీ కిందపడి మృతి చెంది పరిస్థితి
మృతునికి నలుగురు పిల్లలు ఒక భార్య ఉన్నారు ముగ్గురు మగపిల్లలు ఆడపిల్ల కలదు
కుటుంబం బాధ్యత అంతా ఈయన చూస్తుంటారు
ఇప్పటికే తరచుగా పార్వతీపురం నుండి కోనేరు మీదుగా ఒరిస్సాకు ప్రతిరోజు పెద్దపెద్ద లారీలు పరిమితికి మించిన లారీలు అతివేగంగా వెళ్లడం తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ ప్రమాదాలు జరగకుండా కొమరాడ మండల కేంద్రంలోని అలాగే గ్రామాల వద్ద స్పీడ్ బ్రేకర్లు వేసి ప్రమాదాలు నివారించాలని అలాగే మితిమీరి లోడులతో వచ్చిన లారీలను అరికట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు డిమాండ్ చేస్తున్నావ్ కాబట్టి ఇప్పటికైనా రోడ్లు భవనాల శాఖ అధికారులు ప్రమాదాలు జరగకుండా అన్ని గ్రామాల వద్ద స్పీడ్ బ్రేకర్లు వేయాలని పరిమితకు మించిన లోడులతో వచ్చిన లారీలను నిలుపుదల చేయాలని అలాగే లారీ కింద పడి చనిపోయిన బిడ్డికి లక్షణ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు కోరుతున్నాము ఇట్లు
కొల్లి సాంబమూర్తి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొమరాడ
ప్రమాదం జరిగిన లారీ వద్ద నుండి మాట్లాడుతున్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి ఫోటో వీడియో మరియు టైర్లు కింద నిజనుజైన లక్ష్మణ