ఎస్సి వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని కూకట్పల్లి వై జంక్షన్ వద్ద డప్పు కొడుతూ డిమాండ్ చెసిన
ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 05: కూకట్‌పల్లి ప్రతినిధి
ఎస్సి వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి వై జంక్షన్ వద్ద డప్పు కొడుతూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తో పాటు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఎస్సి వర్గీకరణ చేయాలని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు అని గుర్తు చేశారు.
ఎస్సి వర్గీకరణ ఆమోదించాలని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి కూడా వినతి పత్రాన్ని అందజేశారు అని
కేంద్ర ప్రభుత్వం ఆమోదించి సంవత్సర కాలం అయినా రేవంత్ సర్కార్ అమలు చేయలేదు అని అన్నారు.
ఎప్పుడూ వర్గీకరణ బిల్లు అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాలి ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.