*ఘనంగా దాశరధి కృష్ణమాచార్యుని శత జయంతి వేడుకలు*
*జమ్మికుంట జులై 22 ప్రశ్న ఆయుధం*
నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రజలలో స్వాభిమానాన్ని రగిలించిన ఉద్యమ కవి దాశరధి కృష్ణమాచార్యుని శతజయంతి వేడుకలను ఘనంగా ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నిర్వహించారు మంగళవారం రోజున జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ బి రమేష్ తెలుగు విభాగాధిపతి డాక్టర్ శ్యామల సమక్షంలో దాశరధి కృష్ణమాచార్యుని శత జయంతి వేడుకల సందర్భంగా ప్రిన్సిపాల్ దాశరధి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కన్నీళ్లు అగ్ని ధారగా మలిచి నిజాం పరిపాలనకు ఎండగట్టిన ప్రముఖ కవి అని తెలంగాణ తల్లి విముక్తి కోసం పోరాడి తెలంగాణ అస్తిత్వపు భావజాలాన్ని నలుగు దిశలలో చాటిన సాహితీ యోధుడు దాశరధి కృష్ణమాచార్యులు అని పేర్కొన్నారు కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ ఎం శ్యామల మాట్లాడుతూ నా పేరు ప్రజా కోటి నా ఊరు ప్రజావాటి అన్న మన ప్రజాకవి నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని తెలంగాణ విముక్తికై పరితపించాడని తన కలలో అగ్ని ధారను కురిపించి రుద్రవీణను మోగించాడని కలం యోధుడై చైతన్య జ్వాలలను రగిలించిన అభ్యుదయ కవి దాశరధి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు