*డేటా ఇంజినీరింగ్ 3 నెలలు ఉచిత శిక్షణ: మంత్రి శ్రీధర్ బాబు*
TG: డేటా ఇంజినీరింగ్లో 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. టాస్క్, శ్రీ సత్య సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుందని పేర్కొన్నారు. 2021 నుంచి 2024 మధ్యలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. మార్చి 1 లోపు అప్లై చేసుకోవాలన్నారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి నియామకాలు కల్పిస్తామని చెప్పారు.