Site icon PRASHNA AYUDHAM

సమాచార హక్కు చట్టం సాధన కమిటి హుజురాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గా దాట్ల శ్రీనివాస్

IMG 20250809 WA0076

సమాచార హక్కు చట్టం సాధన కమిటి హుజురాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గా దాట్ల శ్రీనివాస్ ఏకగ్రీవం

వీణవంక ఆగష్టు 9 ప్రశ్న ఆయుధం

సమాచార హక్కు చట్టం హుజురాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గా వీణవంక మండలం కొండపాక గ్రామానికి చెందిన దాట్ల శ్రీనివాస్ ను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ ప్రజలు కులాలు ప్రవేశించేందుకు సమాచార హక్కు చట్టం ఆర్టిఐ ద్వారా ప్రభుత్వాన్ని నిబంధనల ప్రకారం పౌరులకు లభించాల్సిన ప్రయోజనాలను పొందడంలో సహాయపడేందుకు కృషి చేస్తుందని శివ శక్తి అసూ శక్తి రంగాలలో పనిచేస్తున్న ప్రజల గృహ కుటుంబ సమస్యలు పరిష్కరించేందుకు వారి సంక్షేమానికి నిబద్దతగా పనిచేస్తుందని పేర్కొన్నారు అనంతరం తన నియామకం పట్ల దాట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కమిటీ విధానాలను పటిష్టం చేయడంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించడంలో తన పూర్తి సమయం అంకితం గా ఉపయోగిస్తానని తెలిపారు అదేవిధంగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్ కి, రాష్ట్ర అధ్యక్షులు సురా స్రవంతికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేష్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్ పాశ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version