తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

ప్రశ్న ఆయుధం సుజాతనగర్ మండల రిపోర్టర్ జులై 7. 7.2025

సుజాతనగర్ మండల కేంద్రంలోని వేపలగడ్డ గ్రామని చెందిన ఉడుముల దినేష్ రెడ్డి రెడ్డి
చిన్న వయస్సులోనే కన్నతండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది ఓ కూతురు. వివరాల్లోకి వెళితే సుజాత నగర్ మండలం వేపలగడ్డ గ్రామానికి చెందిన ఉడుముల దినేష్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న గురువారం నాడు తీవ్రమైన కడుపు నొప్పితో మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు. కొడుకులు లేకపోవడంతో పెద్దకూతురు తండ్రికి తలకొరివి పెట్టింది. దుఖాన్ని దిగమింగుకుని చిన్న వయస్సులోనే తండ్రికి అంత్యక్రియలు చేసిన చూసి నీకు ఎంత కష్టం వచ్చిందో అని మృతుడు తల్లి రోధించింది. కుటుంబంలో భర్త చిన్న కుమారుడని ఇప్పుడు పెద్ద కుమారుడిని కోల్పోయారు ఇప్పుడు ఆ కుటుంబంలో మగదిక్కు లేకుండా పోయింది గత కొన్ని సంవత్సరాల క్రింద చిన్న కుమారుడు చనిపోతే ఆ పిల్లని వీళ్లే సాధు జీవనం సాగిస్తూ ఇద్దరమ్మాయిలను చదివిస్తున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోపోవడంతో ఇద్దరు ఆడపిల్లలతో జీవనం సాగించేది ఎలా అని భార్య పడిన బాధను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.

Join WhatsApp

Join Now