– అమరవీరుల త్యాగఫలం ఎస్సీ వర్గీకరణ
– వర్గీకరణ ఫలితం మాదిగ అమరవీరులకు అంకితం
– ఎమ్మార్పీఎస్ నాయకులు
గజ్వేల్, 01 మార్చి 2025 : మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని గజ్వేల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో శనివారం నాడు ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో అమరులైన అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు మైస రాములు మాదిగ, సంగపురం రవి మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు సాధించినటువంటి ఎస్సీ వర్గీకరణ అంతిమ విజయం మాదిగ అమరవీరుల త్యాగ ఫలితం గానే సాధించామని, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ప్రభుత్వాలపై 30 సంవత్సరాల పోరాటాలు చేశామని, ఈ విజయాన్ని మన మాదిగ అమరవీరులకు అంకితం చేద్దామన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మైస ప్రభుదాస్ మాదిగ,గ్రామ అధ్యక్షులు మైస శ్రీకాంత్ మాదిగ, ఉపాధ్యక్షులు మైస ధావిధ్ మాదిగ, దయ్యల రవి మాదిగ, కమిటీ సభ్యులు బాధట్ల రామ్ మాదిగ, సంగపురం శేఖర్, దయ్యల వినయ్, ఆటకూరి సంజీవ్, ఆటకూరి శ్రీకాంత్, గడ్డమిది రమేష్, ఎర్రవళి స్వామి, కిష్టపురం కాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.