Site icon PRASHNA AYUDHAM

డబ్బులు ఇస్తే రాత్రి అయినా పగలైనా ఓకే

IMG 20241116 WA0037

IMG 20241116 WA0036 1

డ్యూటీ టైం అయిపోయిన విధులు చేస్తాం

 సర్వర్ పేరు చెప్పి డబ్బులు సంపాదిస్తున్న సబ్ రిజిస్టర్

 సబ్ రిజిస్టర్ నిర్వాకం

నిబంధనలకు విరుద్ధంగా కామారెడ్డి సబ్ రిజిస్టర్ కార్యాలయం

సాయంత్రం-6; గంటల 30  దాటిన యధావిధిగా రిజిస్ట్రేషన్లు

మధ్యవర్తులతో  ఈ కథంగమంతా నడుస్తుందా

-ఆరు దాటిన తర్వాత రిజిస్ట్రేషన్లు చేస్తే దేనికి సంకేతం

కామారెడ్డి సబ్ రిజిస్టర్ అక్రమాలు డ్యూటీ టైం లో కాకుండా వితౌట్ డ్యూటీ టైం లో సబ్ రిజిస్టర్లు జరుగుతున్నాయి ఇన్చార్జి సబ్ రిజిస్టర్ మధుకర్ డాక్యుమెంట్

-డ్యూటీ టైం లో
కాకుండా సాయంత్రం.6.30.  అనేక ముడుపులు ముడుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి ?

-డబ్బులు
తీసుకుంటూడ్యూటీ టైం అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తున్నాడని ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి?

-అవినీతి అవకతవకలకు కేరాఫ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం..

గతంలో ఓ సబ్ రిజిస్టర్ నీ లీవ్ పై వెళ్లాలని ఒత్తిడి చేశారని నీకు ఆరోపణలు వచ్చాయి

అవినీతి అక్రమాలకు కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేరాఫ్ గా మారిందని పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే వారు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

అవినీతి అక్రమాలకు కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేరాఫ్ గా మారిందని పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే వారు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి నేరుగా పనుల కోసం వెళితే రోజుల తరబడి తిప్పుకుంటునటువంటి సంఘటనలు ఉన్నాయని పలువురు వాపోతున్నారు. ప్లాట్ రిజిస్ట్రేషన్లు కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన సమయంలోను, అలాగే కామారెడ్డి రిజిస్టార్ పరిధిలో ఉండి ఎక్కడి నుండైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనే నిబంధన అమలులో ఉన్న కాలంలో జరిగిన డాక్యుమెంట్లను ఆధారం చేసుకుని చేసే రిజిస్ట్రేషన్ల విషయంలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పూర్తిస్థాయిలో రిజిస్టార్లు అందుబాటులో లేని సమయంలో ఇంచార్జీలుగా వ్యవహరించిన వారు ధనార్జనే ధ్యేయంగా అడ్డగోలుగా నిబంధనలు పాటించకుండా పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని రిజిస్ట్రేషన్ తతంగాలు పూర్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.? కార్యాలయంలో ఒక ఉద్యోగి తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి మరొక చోటికి బదిలీ కాకుండా తిష్ట వేసి రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జటిలమైన సమస్య ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లకు పరిష్కారం చూపిస్తూ రిజిస్ట్రేషన్ చేయించి అటు రియల్టర్ల ద్వారా ఇటు డాక్యుమెంట్ల రైటర్లలో కొంతమందిని ఏజెంట్లుగా పెట్టుకొని రెండు చేతుల అక్రమార్జనకు తెరలేపాడని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల విషయంలోనూ ఉన్నతాధికారులు విచారణను తూతూ మంత్రంగా నిర్వహించి సమస్యలను దాటవేశారని ఆరోపణలు కూడా లేకపోలేదు.

ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి కారణమా ?

కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగే అవకతవకలు అక్రమాలకు ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి కారణమని, కొంతమంది వినియోగదారులు బహిరంగంగా ఉన్నతాధికారుల తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వారు ఉదాసీనంగా ఉన్న కారణంగానే కార్యాలయ సిబ్బంది ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

*సరైన ఆడిట్ లేక ప్రభుత్వ ఆదాయానికి గండి ?*

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే కార్యకలాపాల పై ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆడిట్ విభాగం తనిఖీలు చేస్తుంది. అయితే ఆడిట్ కు వచ్చే అధికారులను మంచిగా చేసుకొని కార్యాలయంలో అన్ని పనులు సవ్యంగా జరిగినట్లు నివేదికలు పొందుతున్నారని విమర్శలు ఉన్నాయి.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమ ఉదాసీన వైఖరికి స్వస్తి పలికి కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత పది సంవత్సరాలుగా జరిగిన కార్యకలాపాలపై ప్రత్యేక విచారణ చేస్తే అధికారుల నిర్వాహకం అవకతవకలు వెల్లడయ్యే అవకాశముందని ఆ దిశగా ఉన్నత అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు వేచి చూడవలసిందే

డబ్బులు ఇస్తే రాత్రి అయినా పగలైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కామారెడ్డి సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. శనివారం రాత్రి 6 దాటినా కానీ వారు రిజిస్ట్రేషన్ పనిలో నిమగ్నమై ఉండడంతో కార్యాలయ సమయంలో వచ్చిన తమ పనులు కాకపోవడంపై పలువురు అగ్రహారం వ్యక్తం చేస్తున్నారు. ఓ పత్రిక విలేఖరి ఈ టైంలో రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని ప్రశ్నించడంతో సర్వర్ ఇస్తుందని సర్వర్ పని చేయకపోవడం వల్ల ఈ టైం దాకా పనిచేస్తామన్నామని అనడం గమనార్వం. పైగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతోనే తాము ఇప్పటివరకు విధులు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి ఇవ్వని తెలిసినా పట్టి పట్టనట్లు ఊరుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.

Exit mobile version