Site icon PRASHNA AYUDHAM

డిసిసి పీఠం ఎల్లారెడ్డిదేనా..?

IMG 20251015 WA0045

ఎల్లారెడ్డి అక్టోబర్ 15, (ప్రశ్న ఆయుధం):

రాజకీయ సమీకరణాల్లో ప్రతిసారీ పక్కన పడుతూ వస్తున్న ఎల్లారెడ్డి నియోజకవర్గం మరోసారి ప్రాధాన్యత చర్చలోకి వచ్చింది. మంత్రివర్గ పదవుల్లోనూ, జిల్లా స్థాయి కీలక హోదాల్లోనూ ఇప్పటివరకు ఎల్లారెడ్డికి “మొండి చేయి”నే ఎదురవుతోంది. వరుసగా రెండు సార్లు జిల్లాపరిషత్ చెయర్‌పర్సన్ జుక్కల్ నియోజకవర్గానికి వెళ్ళడం, అలాగే డిసిసి పీఠం కామారెడ్డి వశం కావడంతో స్థానిక కాంగ్రెస్ నేతల్లో ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది.

గతంలో బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, అభివృద్ధి పథకాలు బాన్సువాడ వైపుకే మళ్లించబడిన నేపథ్యంలో ఎల్లారెడ్డి ప్రజలు “మనం ఎప్పుడూ వెనకబడిపోతున్నామా?” అని ప్రశ్నించుకుంటున్నారు.

మధన్ మోహన్ ఫ్యాక్టర్ కీలకం..!

ఎల్లారెడ్డి కాంగ్రెస్‌కు శక్తివంతమైన నాయకత్వం అందిస్తున్న ఎమ్మెల్యే మధన్ మోహన్ రావు ఈ సారి కీలక పాత్ర పోషించనున్నారనే అంచనా. ఆయన తలచుకుంటే ఈసారి డిసిసి పీఠం ఎల్లారెడ్డి దిశగా మలుపు తిరగొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా జరిగిన అభిప్రాయ సేకరణలో కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల నుంచి రెండేసి పేర్లు సమర్పించగా, ఎల్లారెడ్డి నుంచి మాత్రం ఏకగ్రీవంగా ఒక్క పేరే ముందుకు రావడం ఆసక్తికర పరిణామంగా నిలిచింది.

పార్టీ అంతర్గత సమీకరణాలపై చూపు..!

ప్రస్తుతం టిపిసిసి లో చురుకుగా కొనసాగుతున్న అభిప్రాయ సేకరణ లో ఎల్లారెడ్డి నేతలు ఏకమై ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ ‌గా భావిస్తున్నారు. ఈ సారి సమీకరణాలు అనుకూలిస్తే, చాలా కాలం తర్వాత ఎల్లారెడ్డికి రాజకీయ న్యాయం జరగవచ్చని పార్టీ వర్గాల విశ్లేషణ.

Exit mobile version