Site icon PRASHNA AYUDHAM

పూర్వ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత కే రోశయ్య వర్ధంతి 

Screenshot 20251204 183344 1

పూర్వ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత కే రోశయ్య వర్ధంతి

 

కలెక్టరేట్‌లో ఘన నివాళులు

 

 

ప్రశ్న ఆయుధo

 

కామారెడ్డి జిల్లా డిసెంబర్ 04

 

పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళనాడు–కర్ణాటక రాష్ట్రాల మాజీ గవర్నర్, దివంగత శ్రీ కె. రోశయ్య వర్ధంతి సందర్భంగా, గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌లో DYSO ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్ రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

 

అధికారులు మాట్లాడుతూ— రోశయ్య గారి ప్రజా సేవలు, సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, పరిపాలనలో చూపిన నిష్ఠ చిరస్మరణీయమని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు,

TNGOs జిల్లా అధ్యక్షుడు ఎన్. వెంకట్ రెడ్డి,

అసోసియేట్ అధ్యక్షుడు ఎం. చెక్రధర్,

TGOs జిల్లా కార్యదర్శి సాయి రెడ్డి

పాల్గొన్నారు.

Exit mobile version