కామారెడ్డిలో గుర్తు తెలియని వృద్ధుడి మృతి
గంజి గేటు వద్ద శవం గుర్తింపు… పోలీసుల విచారణ
కామారెడ్డి జిల్లా ప్రతినిధిప్రశ్న ఆయుధం డిసెంబర్ 26
కామారెడ్డి పట్టణంలోని గంజి గేటు ప్రాంతంలో శుక్రవారం (తేది: 26-12-2025) ఉదయం ఒక గుర్తు తెలియని వృద్ధుడి శవం గుర్తించబడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 80 సంవత్సరాల వరకు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. శరీరంపై దుస్తులు లేకుండా, ఒక రగ్గుతో కప్పబడి ఉండటం గమనించబడింది. చూడటానికి యాచకుడిలా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
మృతుడి వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని, ఆయనకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే కామారెడ్డి పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరారు. సమాచారం అందించేందుకు 8712686145, 8712666246 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.