గజ్వేల్ నియోజకవర్గం, 11 జనవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం కొండపోచమ్మ సాగర్ డ్యామ్ లో ఏడుగురు యువకులు శనివారం ఉదయం కొండపోచమ్మ సాగర్ చూసేందుకు వచ్చారు వారు హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన వారు. పోచమ్మ డ్యామ్ లో పడి ఐదుగురు చనిపోయారు మరో ఇద్దరు సురక్షితంగా బయటకు రావడం జరిగింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వాళ్ళందరూ అందులో పడి గలంతయ్యారు. ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఐదు యువకులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ పర్యవేక్షణలో మృతులను గజ ఈతగాళ్లు సహాయంతో బయటకు తీయడం జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం వారి వివరాలు ధనుష్ (20), లోహిత్ (17), దినేశ్వర్ (17), జతిన్ (17), సాహిల్ (17) గా గుర్తించడం జరిగిందన్నారు. డెడ్ బాడీలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని పోలీసులు వివరించారు.
కొండపోచమ్మ సాగర్ డ్యామ్ లో యువకుల మృతి
Published On: January 11, 2025 7:34 pm