Site icon PRASHNA AYUDHAM

డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం

Galleryit 20251219 1766153946

డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం

‘ఒకే ప్రపంచం – ఒకే హృదయం’ నినాదంతో హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ డిసెంబర్ 19

ప్రపంచంలోని అతి పెద్ద ధ్యాన కేంద్రంగా గుర్తింపు పొందిన హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ సంస్థ – శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం డిసెంబర్ 21న రాత్రి 8 గంటలకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ గ్లోబల్ గైడ్ కమలేష్ డి. పటేల్ (దాజీ) గారి నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. శాంతి, కరుణ, ఐక్యత లక్ష్యంగా లక్షలాది మంది హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం ద్వారా ఆన్లైన్లో ఏకమవుతారని నిర్వాహకులు తెలిపారు. “ఒకే ప్రపంచం – ఒకే హృదయం” అనే సందేశంతో ప్రపంచ శాంతి కోసం ఈ ధ్యాన కార్యక్రమం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రపంచ ధ్యాన దినోత్సవానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్, ఆశ సంఘాల చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ప్రతినిధులు మాజేటి భానుమతి, శిరీష పద్మ, నగేష్, పావని తదితరులు పాల్గొన్నారు.

డిసెంబర్ 21వ తేదీ రాత్రి 8 గంటలకు యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా జరిగే ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ధ్యానం యొక్క విశిష్టతను తెలుసుకుని, ఆధ్యాత్మిక అనుభూతిని పొందేందుకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

రిజిస్ట్రేషన్ కోసం లింకులు:

👉 hfn.link/meditation

👉 hfn.link/21dec

👉 Daaji Live

Exit mobile version