*కరీంనగర్, మెదక్ , నిజామాబాద్, ఆదిలాబాద్* *పట్టభద్రుల ఎమ్మెల్సీ* *ఎన్నికల్లో ఓటరు* *నమోదుకు చివరి తేదీ డిసెంబర్ 9 : ఎం శ్రీనివాస్ కుమార్* . ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త ఎం శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ పట్టభద్రుల ఓటరు నమోదు మరియు సవరణకు అవకాశం కల్పించినందున దానికి వినియోగించుకోవాలని తెలిపారు. పట్టభద్రుల ఓటర్ నమోదు కోసం ఫారం 18 పూరించి డిగ్రీ సర్టిఫికెట్, ఓటర్ గుర్తింపు, ఆధార్ కార్డ్ జిరాక్స్లను జతపరిచి స్థానిక రెవెన్యూ కార్యాలయంలో అందచేయలి లేదా www.ceotelangana.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అందుకుగాను నవంబర్ 23 నుంచి 9 డిసెంబర్ వరకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించినది దీనిని అందరూ సద్వినియోగ పరుచుకోవాలని ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త ఎం శ్రీనివాస్ కుమార్ కోరారు.