*దేశ వ్యాప్తంగా 18 ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రోప్ వే ల ఏర్పాటుకు నిర్ణయం*
దేశంలోని 18 ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రోప్ వే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఇందులో శబరిమల లోని అయ్యప్ప ఆలయం కూడా ఉంది. పంబ నుంచి శబరిమల లోని సన్నిధానం వరకు 2.62KM పొడవున రోప్ వే నిర్మిస్తారు. జమ్మూ కశ్మీర్ లోని బాల్టాల్ నుంచి అమర్నాథ్ వరకు 11.6కిలోమీటర్ల మేర రోప్ వే నిర్మిస్తారు. రోప్వే ప్రాజెక్టులకు సంబంధించి తగిన డిజైన్లతో రావాలని కేంద్రం కన్సల్టెంట్లును ఆహ్వానించింది.