విప్లవోద్యమానికే అంకితం…

జీవితం అంతా విప్లవోధ్యమానికే అంకితం చేసిన రాయల చంద్రశేఖర్ పోరాట స్ఫూర్తిని అనుసరిద్దాం…!

సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా

పోటు రంగారావు రాష్ట్ర కార్యదర్శి
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి 23
జీవితం అంతా విప్లవోధ్యమానికే అంకితం చేసి అకస్మిక మరణానికి గురైన రాయల చంద్రశేఖర్ అన్న పోరాట స్ఫూర్తిని విప్లవ శ్రేణులు గా ఉన్న మనం అనుసరించి ముందుకు సాగాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సంతాపసభ ఇల్లందు పట్టణం చండ్ర కృష్ణ మూర్తి ట్రస్ట్ భవన్ లో మంగళవారం సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా ఇల్లందు డివిజన్ కార్యదర్శి ఈసంశంకర్ అధ్యక్షతన జరిగింది.సంతాప సభ ప్రారంభానికి ముందు తాత్కాలిక స్థూపం ఏర్పాటు చేసి రాయల చంద్రశేఖర్ చిత్ర పటానికి ప్రజాపంథా పార్టీ అధినేతలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎర్ర పూలతో నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈసంధర్భంగా వక్తలు: పోటు రంగారావు రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిన్న వయసులోనే కుటుంబ ప్రేరణతో విప్లవోద్యమానికి ఆకర్షితుడై పి డి యస్ యూ విప్లవ విద్యార్థి ఉద్యమంలో ప్రయాణం ప్రారంభించి అనతికాలంలోనే రహస్య జీవితాన్ని కొనసాగించాడు.ఈక్రమంలో సరైన విప్లవ పంథాను నిలబెట్టడం కోసం అనేక ఒడుదొడుకులు, జైలు, నిర్భంధం, అక్రమ కేసులు అనుభవిస్తూనే మిత్ర ద్రోహుల నుండి అవమానాలు,హేలనలు, నీచపు కామేంట్లు వచ్చినా విప్లవోద్యమం కోసం గుండె ధైర్యంతో నిలబడిన చంద్రశేఖర్ అనుహ్యంగా ఆత్మహత్యకు పాల్పడడం విషాదకరమని వారు అన్నారు.
కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఉమ్మడి పార్టీ నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులుగా, పార్టీ రాష్ట్ర నేతగా, రైతుకూలీ సంఘం నాయకుడిగా, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కంట్రోల్ కమీషన్ చైర్మన్ గా తన బాధ్యతల ను క్రియాశీలకంగా, సమర్థవంతంగా నిర్వర్తించారని వారు అన్నారు. చివరి వరకు ప్రజాపంథా రాజకీయాల పట్ల విశ్వాసం తో సైధ్ధాంతిక రాజకీయ పోరాటం కొనసాగించే క్రమం లో రాయల చంద్రశేఖర్ ను అవమానించిన వారే నేడు ఆయన మృతదేహాం గా ఉన్న ఆయన భుజం పై తుపాకీ పెట్టి ప్రజాపంథా పార్టీ పై గురి పెట్టి కాల్చి బలహీనపర్చేందుకు కుట్రలు పన్నుతున్నారని వారి దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండిస్తూ విప్లవోద్యమాన్ని కాపాడుకునేందుకు చంద్రశేఖర్ అన్న పోరాట స్ఫూర్తిని అనుసరిస్తూ పోరాటాలలో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాష్ట్ర నాయకులు కేచ్చల రంగారెడ్డి చండ్ర అరుణ ముద్ద బిక్షం పాయం చిన్న చంద్రన్న నాయిని రాజు, మాచర్ల సత్యం, జాటోత్ కృష్ణ వాంకుడోత్ అజయ్ కాంపాటి పృద్వి ఎదలపల్లి సావిత్రి పూణేంకుమార్ అజ్మీరా బిచ్చ రేసు సుభాష్ చంద్రబోస్ ఎస్ కే యాకూబ్ షావలి పాయం వెంకన్న బుర్ర వెంకన్న బుర్ర రాఘవులు కొమరం శాంతయ్య బొర్రా వెంకన్న శ్రీరామ్, రామ్ చంద్రు కోటయ్య డివిబి చారి జరుపులా సుందర్ పార్టీ మాజీ కౌన్సిలర్ రేసు సరిత మల్లెల వెంకటేశ్వర్లు శేషయ్య వీరన్న పిళ్లి మల్లేష్, రఘు రంజాన్ కూనూరు వీరన్న తదితరులు పాల్గొన్నారు

విప్లవాభి వందనాలతో…
యాకూబ్ షావలీ
జిల్లా నాయకులు

Join WhatsApp

Join Now