నవంబర్ 29న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో దీక్షా దివస్.

నవంబర్ 29న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో దీక్షా దివస్.

పార్టీ శ్రేణులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయగలరు.

బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.

ఈనెల 29న నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో దీక్ష దివాస్ విజయవంతం చేయాలని నాగర్కర్నూల్ బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ,దీక్ష దివాస్ ప్రోగ్రాం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే విజయ్ సింహ రెడ్డి, పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏప్రిల్ 27, 2001న గులాబీ జెండాను ఎగరవేసిన నాయకులు కేసీఆర్ తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి, ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహానాయకులు కేసీఆర్

నవంబర్ 29, 2009న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజని మన అందరికీ తెలుసునని అన్నారు. స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం అని ఆనాడు “కేసీఆర్ సచ్చుడో…తెలంగాణ తెచ్చుడో” అని తెగువ కనబరిచిన నాయకుడికి 3 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో అండగా నిలబడ్డారని అన్నారు.కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి, మెప్పించి కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ కలిపిన సందర్భం దీక్షా దివస్ అని అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు ఛిద్రం అయ్యిందని .మళ్లీ ఈ రోజు అవే పరిస్థితులు కనిపిస్తున్నాయని. అవే నిర్భంధాలు, అవే అణచివేతలు, అవే దుర్భర పరిస్థితుల నేపథ్యం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కనిపిస్తున్నాయని, ఆనాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో నేడు మళ్లీ రెండు జాతీయ పార్టీల మెడలు వంచాల్సిన పరిస్థితి ప్రతి పౌరునిపై ఉందని అన్నారు.కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణ మళ్లీ అదే అంధకారమనే పరిస్థితి వచ్చిందని .ఒక్క వర్గం కాదు సంపన్న వర్గాల నుంచి అట్టడుగు వర్గాల వరకు అందరూ బాధపడుతున్నారని అందుకే దీక్షా దివస్ నుంచి స్ఫూర్తి పొందని,కాంగ్రెస్ కబంధహస్తాల నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవటానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు.స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రొఫెసర్ జయశంకర్ తరుచూ చెప్పేవారని,ఈ రోజు ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని, ఆ నాటి పాలనను కోరుకుంటున్నారని . దాని కోసం మా పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన సందర్భం ఆసన్నమైందన్నారు. నవంబర్ 29న 33 జిల్లాల్లో మా పార్టీ కార్యాలయాల్లో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం అని అన్నారు. తెలంగాణపై కేసీఆర్ ఏ విధంగా చెరగని ముద్ర వేశారో మళ్లీ గుర్తు చేసుకుంటూ రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు కదం తొక్కుతాం అని పిలుపునిచ్చారు.29 నవంబర్ రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కదం తొక్కాలని పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు. మా పార్టీ నాయకులంతా ఆ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తూ తెలంగాణ తల్లికి ప్రణమిల్లుతాం అన్నారు.

కేసీఆర్ దీక్షలో నిమ్స్ హాస్పిటల్ పాత్ర కూడా ఘనమైనది. ఆ రోజు నిమ్స్ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిందని,అందుకే ఆ రోజు నిమ్స్ హాస్పిటల్‌లో అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చేసాం అని అన్నారు.

ఆనాటి కార్యక్రమాలు, ఉద్యమ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు తెచ్చే విధంగా మీడియా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు

ఈ దుర్మార్గ కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని అన్నారు.

Join WhatsApp

Join Now