Site icon PRASHNA AYUDHAM

దీక్ష యావత్ భారతదేశ రాజకీయ వ్యవస్థను కదిలించింది

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 29వ తేదీన దీక్షాదివాస్ ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు భారాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్షా దివాస్ నిలుస్తుందన్నారు. 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని తెలిపారు.

ఈ దీక్ష యావత్ భారతదేశ రాజకీయ వ్యవస్థను కదిలించిందని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసిందన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని చెప్పారు. ఈ నెల 29న కరీంనగర్‌లో జరిగే దీక్షా దివస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు.

Exit mobile version