నిజామాబాద్ అంబేడ్కరెట్లచే దీక్షభూమి సందర్శన..

 

1956లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఏడు లక్షల జనంతో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన పవిత్ర స్థలం పేరు దీక్షభూమి. ఇది మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతంలో కలదు. ప్రపంచ ఖ్యాతి గాంచిన ప్రాంతం ఇది. ఐతే కారన్సీ నొట్లపై అంబేడ్కర్ పోటో ముద్రించాలని మొన్న డిల్లీలో జరగిన మహాధర్నా కార్యక్రమానికి హాజరై తిరిగి ప్రయాణంలో భాగంగా శుక్రవారం నిజమాబాద్ అంబేడ్కర్ వాదుల బృందం దీక్షభూమిని సందర్శించారు. అక్కడ దీక్షభూమి తోపాటు డ్రాగన్ ప్యాలెస్, అంబేడ్కర్ మందిర్, ప్యాగోడ ధ్యాన సెంటర్, నాగ్ లోక్, నాగార్జున యూనివర్శిటీ బుద్ధభూమి, బాబాసాహెబ్ అంబేడ్కర్ లైబ్రెరీ, సంవిధాన్ చౌక్, ఇండియన్ సెంటర్ పయిట్ తదితర స్ఫూర్తిదాయక బౌద్ధమయ్ ప్రదేశాలను కండ్లరా చూసి గొప్ప అనుభూతిని పొందారు. బోధిసత్వుడు డాక్టర్ అంబేడ్కర్ ఈ భారత దేశాన్ని తిరిగి బౌద్ధమయం చేయాలని కార్యకర్తలకు ఇచ్చిన సందేశం అమల్లో పెట్టాలంటే ప్రతి కార్యకర్త దీక్షభూమిని సందర్శించా ల్సిందేనని వారు జ్ఞాపకం చేశారు. ఇట్టి ఐతిహాసిక పర్యటనలో ప్రఖ్యాత బహుజన నాయకులు డి.ఎల్ మాలజీ, జర్నలిస్టులైన అంగుళి మాలజీ, మామిడి రాజు లు ఉన్నారు. ఇలాంటి చారిత్రాత్మకమైన తమదైన గొప్ప బౌద్ధ సంస్కృతి ప్రతీకలను తమ కుటుంబాలతో సహా సందర్శించాలని మరి నొక్కి చెప్పారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇలాంటి అరుదైన ప్రాంతాలను వీక్షించడానికి వెళ్ళాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు..

Join WhatsApp

Join Now