దీన్ దయాల్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలి

*దీన్ దయాల్ జీ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలి*

 

*బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి*

 

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 25*

 

     బిజెపి ఆవిర్భావ స్ఫూర్తిదాత పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. బుధవారం రోజున దీన్ దయాల్ ఉపాధ్యాయ జన్మదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా స్మరించుకొని అనంతరం పట్టణంలోని 39 బూత్ లల్లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని కొనియాడారు. జనసంఘ్ ఏర్పాటు లో దీన్ దయాల్ పాత్ర కీలకమని గుర్తు చేశారు. అసమానతలు లేని, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఉండాలని ఆకాంక్షించేవాడని, వారి ఆలోచనలకు అనుగుణంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని బిజెపి నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్ జిల్లా కార్యదర్శి చెన్న మాధవని నరసింహ రాజు అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ పల్లపు రవి మోతే స్వామి అప్పం మధు యాదవ్ ఇట్టికల స్వరూప ఎదలపురం అశోక్ తూడి రవిచంద్ర రెడ్డి మోడెం రాజు బూరుగుపల్లి రామ్ గర్రెపల్లి నిరుప రాణి రాచపల్లి ప్రశాంత్ ముకుందం సుధాకర్ అప్పల రవీందర్, ఉడుగుల మహేందర్, శివర్తి ప్రవీణ్ పోలు అన్నమయ్య కేశ సరూప, శివర్తి అఖిల్ మోతే అర్జున్, విలాసాగర్ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now