భువనగిరి జిల్లా కేంద్రంలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య?

*భువనగిరి జిల్లా కేంద్రంలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య?*

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం సాయంత్రం విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. భువనగిరికి చెందిన హాసిని అనే డిగ్రీ విద్యార్థిని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది, హాసిని హైదరాబాద్ ఓ కాలేజీలో డిగ్రీ చదువు తుంది,గత కొద్దీరోజులుగా నిఖిల్ అనే యువకుడు అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ వేధింపసాగాడు. దీంతో మనస్థాపానికి గురైన హాసిని ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Join WhatsApp

Join Now