వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించిన ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్

*వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించిన ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్*

జమ్మికుంట ఏప్రిల్ 22 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంగళవారం ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ రిసర్చ్ స్కాలర్స్ హర్షిత రంజిని సందర్శించారు. తెలంగాణ రాష్ట్రoలో ఉన్నటువంటి వివిధ వ్యవసాయ మార్కెట్ల ను సందర్శిస్తున్న క్రమంలో మంగళవారం జమ్మికుంట మార్కెట్ యార్డును సందర్శించినట్లు వారు తెలిపారు. జమ్మికుంట పత్తి మార్కెట్ యార్డ్ లో జరిగే క్రయ విక్రయాలను పరిశీలించి విధి విధానాలు, కాటన్ ఉత్పత్తి, జీన్నింగ్ మిల్లుల వివరాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న – సదానందం వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, పాలక వర్గం సభ్యులు, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్. మల్లేశం, ద్వితీయ శ్రేణి కార్యదర్శి ఎన్. రాజా, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now