*సోనియా, రాహుల్‌కు ఢిల్లీ కోర్టు నోటీసులు*
*May 02, 2025*
నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక మలుపు ఏర్పడింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు కొనసాగుతుండగా, ఇప్పుడు కోర్టు నుండి నోటీసులు రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.