Site icon PRASHNA AYUDHAM

ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఫ్రెషర్స్ డే లో బండి

IMG 20240811 WA0093

*సాహసోపేత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ మోదీ*

*దేశభక్తి విషయంలో రాజీపడని ధీరత్వం ప్రధాని సొంతం*

*370 ఆర్టికల్ రద్దు ఇందుకు నిదర్శనం*

*ఆర్మీ జవాన్లే దేశానికి రియల్ హీరోస్…*

*అగ్నిపథ్ మంచి స్కీం….*

*విపక్షాలు విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ది పొందాలనుకున్నాయి*
*సంజయ్ ప్రసంగానికి విద్యార్థులు ఫిదా*

*కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్*

*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో ఆగస్టు 11*

సాహసోపేత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశభక్తి విషయంలో రాజీలేని ధీరత్వం మోదీ సొంతమన్నారు. 370 ఆర్టికల్ రద్దుతో జమ్మూకాశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని చాటి చెప్పడమే కాకుండా ‘ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ దో నిషాన్ నహీ చలేగా అని నిరూపించిన ధీరోధాత్తుడు నరేంద్రమోదీ అని కొనియాడారు. కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్ని పథ్’ స్కీం ఎంతో మంచిదని, దీనిపై ప్రతిపక్షాలు లేనిపోని రాద్దాంతం చేసి విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూశాయన్నారు ఈ స్కీంలో ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్దంగా ఉందే తప్ప విపక్షాల వలలో పడి విద్యార్థులు మోసపోవద్దని కోరారు ఆదివారం రోజున కరీంనగర్ లోని రేకుర్తి రాజశ్రీ గార్డెన్ లో నిర్వహించిన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ‘ఫ్రెషర్స్ డే’ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరై చేసిన ప్రసంగం విద్యార్థులకు స్పూర్తిదాయకంగా నిలిచింది బండి సంజయ్ మాట్లాడుతూ మీరంతా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి ఉద్యోగాల కోసం డిఫెన్స్ రంగాన్ని ఎంచుకోవడం నిజంగా చాలా గ్రేట్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో పనిచేయడమంటే దేశానికి సేవ చేయడమే అంత గొప్ప అవకాశం కోసం ఎదురు చూస్తున్న మీరంతా నిజంగా దేశభక్తులే విద్యార్థుల్లో దేశభక్తి నైతిక విలువలు పెంచుతూ క్రమశిక్షణను అలవర్చుతూ అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్న ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులకు హ్యాట్సాఫ్ చెబుతున్నాఅని నా దగ్గరున్న సమాచారం మేరకు గత ఏడేళ్లలో ఈ అకాడమీ నుండి దాదాపు 2 వేల మంది విద్యార్థులు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు ఎంపికయ్యారంటే ఆషామాషీ వ్యవహారం కాదని ఎంతో నిబద్దతతో పట్టుదలతో శిక్షణనిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఢిల్లీ ఢిఫెన్స్ అకాడమీ నిర్వాహకులకు నా అభినందనలు తెలిపి టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే డిఫెన్స్ ఉద్యోగాలు సాధించాలనే తపనతో చిన్న వయసులోనే డిఫెన్స్ శిక్షణ అకాడమీలో చేరి పట్టుదలతో శ్రమిస్తున్న మీ అందరికీ అన్నగా ఆశీర్వదిస్తున్నా అని దేశం కోసం సేవ చేయాలని మిమ్ముల్ని ఇక్కడికి పంపిన మీ తల్లిదండ్రులు నిజమైన దేశభక్తులు వారందరికీ హ్యాట్సాఫ్ కొనియాడారు ఆర్మీలో పని చేయడం అంటే దేశానికి సేవ చేసే అవకాశం దొరకడమే. ఈ అవకాశం అందరికీ లభించదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘అగ్నిపథ్’ అనే ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టారని అగ్నిపథ్ స్కీం రావడంతో పెద్ద ఎత్తున అగ్నివీరులుగా గుర్తించి నాలుగేళ్లపాటు శిక్షణ ఇస్తున్న నాలుగేళ్ల తరువాత వంద మందిలో 25 శాతం మందిని సెలెక్ట్ చేసి ఆర్మీలో చేర్చుకుంటున్నామని మిగిలిన వాళ్లకు కార్పస్ ఫండ్ పేరిట 5 లక్షలతోపాటు కేంద్రం మరో 5 లక్షలు, మరో లక్ష వడ్డీ కలిపి మొత్తం 11 లక్షల రూపాయలకు నగదును కేంద్రం అందజేస్తుంది. భవిష్యత్తులో జరిగే ఆర్మీ రిక్రూట్ మెంట్ లో అగ్ని వీరులకు 10 శాతం రిజర్వేషన్ కోటాను ప్రకటించిందని 4 ఏళ్లపాటు ఉద్యోగం చేసే సమయంలో ఏదైనా జరిగితే 48 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుందని విధి నిర్వహణలో చనిపోతే 44 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా (నష్ట పరిహారాన్ని) కూడా చెల్లించడం జరుగుతుందని ఈ సర్వీసులో అంగవైకల్యం కలిగితే కూడా పరిహారం అందజేస్తుందని తెలిపారు
ఎంతో దూరద్రుష్టితో మోదీ ఈ స్కీంను ప్రవేశపెడితే ప్రతిపక్షాలు కొందరు గిట్టని వారు కలిసి ఎంత రాద్దాంతం చేశారో మీ అందరికీ తెలుసని కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలైతే మోదీ ప్రభుత్వంపై విషం చిమ్మారని మోదీ ప్రభుత్వం అసలు ఉద్యోగాలే భర్తీ చేయలేదని ఉపాధి కల్పించలేదని దుష్ప్రచారం చేశారని పేర్కొన్నారు యూపీఏ 10 ఏళ్ల పాలనలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య 7 లక్షల లోపు మాత్రమే కానీ మోదీ ప్రభుత్వం ప్రతినెలా 70 నుండి 90 వేల ఉద్యోగాల చొప్పున ఒక్క ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోందని ఇవిగాకుండా 2014 నుండి 2023 వరకు 8 లక్షల ఉద్యోగాలకుపైగా భర్తీ చేసిందని యూపీఏ హయాంలో వందల్లోనే స్టార్టప్ లు ఉంటే… మోదీ పాలనలో 1 లక్షా 40 వేల స్టార్టప్స్ ప్రారంభమై యువత తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా ఎంతో మందికి ఉద్యోగాలను కల్పించే స్థాయికి తీసుకొచ్చారని అంతేగాకుండా 8 కోట్ల మందికిపైగా ప్రజలకు ముద్ర రుణాలందించి వ్యాపారాలను ప్రారంభించేలా చేశారని గత 10 ఏళ్లలో దేశ బడ్జెట్ 3 రెట్లు పెరిగి 48 లక్షల కోట్లకు చేరుకుందని 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారంటే మోదీ పాలన ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చుఅని మోదీ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో కేరాఫ్ అడ్రస్ గా నిలిచారని దేశభక్తి విషయంలో రాజీలేని ధీరోధాత్తుడు మోదీ అని పంద్రాగస్టు నాడు దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేసి సంబురాలు జరుపుకుంటే కాశ్మీర్ లో బాంబు పేలుళ్లు జరిగేవని కాశ్మీర్ లో ఈ దేశ పతాకాన్ని ఎగరేయరని ఈ దేశ పౌరులు కాశ్మీర్ లో గజం జాగా కూడా కొనే అవకాశం లేదని అక్కడి వాళ్లను పెళ్లిళ్లు చేసుకునే అవకాశం లేదని ఈ మేరకు కాంగ్రెస్ పాలకులు 370 ఆర్టికల్ ను తీసుకొస్తే ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీ నహీ చలేగా అంటూ శ్యామాప్రసాద్ ముఖర్జీసహా ఎంతో మంది కార్యకర్తలు, పైనకులు పోరాడి ప్రాణత్యాగం చేశారు. ఈ విషయాన్ని గమనించిన మోదీ 370 ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ దేశాభివ్రుద్ది కోసం మోదీ చేస్తున్న క్రుషిలో మీరంతా భాగస్వాములు కావాలని కోరుతున్నానని విద్యార్థులకు తెలిపారు దేశానికి రియల్ హీరోలు జవాన్లే. అందుకే మోదీ దీపావళి పండుగ సంబురాలు సరిహద్దులకు వెళ్లి జవాన్ల మధ్యే జరుపుకుంటారని
రియల్ హీరోలే మా అందరికీ స్పూర్తి. జవాన్ కావాలని కలలుకంటున్న మీరంతా శిక్షణను పూర్తి చేసి లక్ష్యాన్ని సాధించాలే తప్ప మధ్యలో పారిపోకుండా మీ తల్లిదండ్రులను కలలను సాకారం చేయండి బండి సంజయ్ పేర్కొన్నారు

Exit mobile version