పోగొట్టుకున్న పర్సు తిరిగి అందజేత
కామారెడ్డి జిల్లా తాడ్వాయి,
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 16
తాడ్వాయి పోలీసుల నిజాయితీ మరోసారి వెలుగుచూసింది. భవానిపేట్ గ్రామానికి చెందిన సాతెల్లి నరేష్ తండ్రి లక్ష్మయ్య పర్సు నందివాడ గ్రామంలో తప్పిపోయింది. ఆ పర్సును ఒక వ్యక్తి పోలీసుల వద్దకు అందజేయగా, తాడ్వాయి ఎస్‌ఐ టీ. మురళి పరిశీలించి తిరిగి యజమానికి అందజేశారు.
ఆ పర్సులో రూ.200 నగదు, ఆధార్ కార్డు ఒరిజినల్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఏటీఎం కార్డు, హెల్త్ కార్డు వంటివి ఉండగా, ఎలాంటి లోటు లేకుండా యజమానికి అప్పగించారు. పోలీసులు చూపిన నిష్పాక్షికతకు గ్రామస్థులు ప్రశంసలు కురిపించారు.
👉 “పోలీసుల సేవా తత్వం ప్రజలకు ఆదర్శం. పర్సు తిరిగి రావడం ఊహించలేదు” అని లభ్ధిదారుడు సాతెల్లి నరేష్ ఆనందం వ్యక్తం చేశారు.