*ప్రభుత్వ ఆసుపత్రి జమ్మికుంట లో ప్రసవాలు షురూ*
*సూపరిండెంట్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి చొరవతో ప్రసవాలు*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 12*
పేద ప్రజల పట్ల దేవుడు అనే పేరున్న జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ పారిపాటి శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అతి కొద్ది సమయంలోనే జమ్మికుంట ప్రభుత్వాసుపత్రిలో ఎంతో కాలంగా నిలిచిపోయిన ప్రసవాలు షురూ అయ్యాయి జమ్మికుంటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం గర్భిణులకు ప్రసవాలను చేయడానికి ఆరంభించారు.ఆరు మాసాలుగా గైనకాలజిస్ట్ లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చేయడాన్ని నిలిపివేశారు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి చోరవతో గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి ప్రసవం చేశారు.కరీంనగర్ డిసిహెచ్ఎస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మొదటి కాన్పు కేసు చేశారు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి సోమవారం గురువారం ప్రసవాలు జరుగుతాయని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.