ఈ నెల 8న పుణ్యక్షేత్రాల దర్శనానికి డీలక్స్ బస్సు సర్వీస్: మెదక్ డిపో మేనేజర్ సురేఖ

IMG 20250706 194354
మెదక్/నర్సాపూర్, జూలై 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఈనెల 8న నర్సాపూర్ నుండి ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, కంచి మీదుగా అరుణాచలం వరకు ప్రత్యేక డీలక్స్ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు మెదక్ డిపో మేనేజర్ సురేఖ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నర్సాపూర్ డిపో నుండి 8న సాయంత్రం 6గంటలకు బస్సు బయలుదేరి వివిధ ధార్మిక ప్రదేశాలను సందర్శించనుందని తెలిపారు. ఈ నెల 8న బయలుదేరి 12వ తేదీన నర్సాపూర్‌కు చేరుకుంటుందని వివరించారు. ఈ ప్రత్యేక పర్యటన బస్సు ద్వారా భక్తులు ప్రధాన దేవస్థానాలను ఒకే ప్రయాణంలో దర్శించుకునే అవకాశముంటుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన భక్తులు ముందస్తుగా బస్సు టికెట్ బుక్ చేసుకోవాలని, పూర్తి సమాచారం కోసం 9491634420, 9494947116 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. ఈ సర్వీస్ పుణ్య క్షేత్రాలు దర్శించే వారి కోసం మంచి అవకాశమని డిపో మేనేజర్ సురేఖ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment