Headlines:
-
దళిత కార్మికుడి మరణానికి కారణమైన మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
-
అట్రాసిటీ కేసులో నిర్లక్ష్యం చూపుతున్న పోలీసులను తప్పుబట్టిన మేకల లత
-
అగ్రవర్ణ మేనేజర్ వల్ల దళిత కార్మికుడు మృతి చెందినా, చర్యలు తీసుకోని పరిస్థితి
-
దళిత హక్కుల రక్షణ కోసం మహాజన మహిళా సమైక్య భారీ ఉద్యమం హెచ్చరిక
దళిత కార్మికుడు మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన తెలంగాణ టూరిజంఅగ్రవర్ణ మహిళ మేనేజర్ పై అట్రాసిటీ నమోదు చేసి చేయాలి
దళిత కార్మికుడి మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన తెలంగాణ టూరిజం అగ్రవర్ణ మహిళ మేనేజర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
……..మేకల లత.
స్థానిక ఆదర్శనగర్ కాలనీ నందు మహాజన మహిళా సమైక్య ఎంఎంఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశ ఉద్దేశించి మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత మాట్లాడుతూ…. అరెస్టులు లేని అట్రాసిటీ లు ఎందుకని, కేసుల గ్రావిటీల పేరుతో అరెస్టులే లేకుండా రాజకీయ ప్రాబల్యం మధ్యవర్తుల ప్రమేయంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నిర్వీర్యం చేస్తున్నారని, 41 సి ఆర్ పి సి కింద నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ తో కేసులను నీరు కారుస్తున్నారని, తమ చర్యలతోరాజ్యాంగబద్ధమైన చట్టాన్ని సైతం అవహేళన చేస్తున్నారని అన్నారు. భద్రాచల పట్టణంలో గత 12 ఏళ్లుగా తెలంగాణ టూరిజం హరిత హోటల్ లో పనిచేస్తున్న ఇసంపల్లి నరసింహారావు అగ్రవర్ణ కులానికి చెందిన బ్రాహ్మణ మహిళ మేనేజర్ తన కుల అహంకారంతో మానసిక ఒత్తిళ్లకు గురిచేసి, అతని మృతికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైందని అన్నారు. చట్టాన్ని పకడ్బందీగా అమలు అమలు పరచాల్సిన పోలీస్ యంత్రాంగం, అధికారులే కేసుల పట్ల అలసత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం వలన బాధితులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. దళిత కార్మికుడి మృతికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమని తెలిసినా కూడా పోలీసులు ఇప్పటివరకు అగ్రవర్ణ మేనేజర్ పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానం కలిగిస్తుందని అన్నారు. అగ్రవర్ణ మేనేజర్ దళిత కార్మికుడి మృతిని తప్పు దోవ పట్టించేందుకు తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులతో తప్పుడు ప్రకటనలు చేయిస్తూ దళిత కార్మికుడి మృతికి యాజమాన్యానికి సంబంధం లేదని తప్పుడు ప్రకటనలు చేయిస్తూ కేసుని తప్పుదోవ పట్టిస్తుందని ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా దళిత కార్మికుడైన నర్సింహారావు మృతికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన అగ్రవర్ణ బ్రాహ్మణ మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకొని తక్షణమే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితుల పట్ల వృక్ష చూపిస్తూ మానసిక వేదన గురిచేసి ఆర్థికంగా నష్టపరిచిన అగ్రవర్ణ మహిళ మేనేజర్ విధుల నుంచి తొలగించి దళిత కార్మికులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహాజన మహిళా సమైక్య ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని భారీ ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహాజన మహిళా సమైక్య జిల్లా ఉపాధ్యక్షురాలు కొచ్చర్ల కుమారి, జిల్లా ఉపాధ్యక్షురాలు కొప్పుల నాగమణి, పట్టణ కన్వీనర్ ఎస్కే సల్మా, తదితరులు పాల్గొన్నారు.
సామాజిక ఉద్యమ వందనాలతో…
మహాజన మహిళా సమైక్య
ఎంఎంఎస్. భద్రాచలం