వికలాంగులకు 6 వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్

*వికలాంగులకు 6 వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్*

*జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి*

*ఇల్లందకుంట జూన్ 9 ప్రశ్న ఆయుధం*

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా వికలాంగులకు 6000 పెన్షన్ను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి డిమాండ్ చేశారు సోమవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న క్రమంలో ఎన్నికల సందర్భంగా వికలాంగులకు అదనంగా 2000 కలిపి 6000 పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల పట్ల చిత్తశుద్ధి కలిగి 6 వేల రూపాయల పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని వికలాంగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని వాసు వడ్లూరి డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment