ముందస్తు అరెస్టులకు నిరసన, విడుదల చేయాలని డిమాండ్
– ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు ఎనగందుల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఎండి రహీం
నస్పూర్, డిసెంబర్ 20 (ప్రశ్న ఆయుధం)
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ లోని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడవ, నాలుగవ వార్డులు అయిన కృష్ణా కాలనీ ఆటో యూనియన్ ఆఫీసు నందు కృష్ణా కాలనీ ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు ఎనగందుల వెంకటేష్, కోశాధికారి బొబ్బల కుమార్ మాట్లాడుతూ .. శుక్రవారం చలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా కృష్ణ కాలనీ ఆటో యూనియన్ అధ్యక్షులు రాగిడి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ భోగ సమ్మయను శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ముందస్తుగా శ్రీరాంపూర్ పోలీసులు అరెస్టు చేయడాన్ని కృష్ణ కాలనీ ఆటో యూనియన్ తీవ్రంగా ఖండిస్తుంది.
కార్మికుల సమస్యలు పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపి ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో స్త్రీల ఉచిత బస్ సౌకర్యం వలన ఆటో కార్మికుల జీవితాలు గడవడం చాలా గగనం అవుతుందని భార్యాబిడ్డలని పోషించడం కూడా ఇబ్బందికి గురి అయ్యి కొందరు ఆటో కార్మికులు కుటుంబ భారం ఈగలేక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈ దిశగా ఆలోచించి ఆటో కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవనాభృతి కల్పించి న్యాయం చేయాలని పలువురు నాయకులు కోరారు. అరెస్టు చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని కృష్ణా కాలనీ ఆటో యూనియన్ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో కృష్ణ కాలనీ ఆటో యూనియన్ నాయకులు ప్రధాన కార్యదర్శి ఎండి రహీం, సబ్ కోశాధికారి గొలుసుల రమేష్, సలహాదారులు చిందం తిరుపతి, ఆటో యూనియన్ సభ్యులు దేవరాజ్, ఇస్మాయిల్, ఆకుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 16