Site icon PRASHNA AYUDHAM

ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు తొలగించిన స్థానిక రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్

IMG 20241222 WA0203

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 22 మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి బయ్యారం మండల కమిటీ కన్వీనర్ బాల్యం రవి బయ్యారం మండల కేంద్రం నుండి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రాo ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఎస్సీ కులాలకు విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా జడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికలల్లో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏజెన్సీ ప్రాంతంలో అనుచబడ్డ కులాలును అభివృద్ధికి దూరం చేయడం సరైనది కాదని ఖండించారు. కాంగ్రెస్ ప్రజాపాలన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్ ప్రకారం ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ కులాలకు రిజర్వేషన్ కల్పించాలని రవి డిమాండ్ చేశారు.

Exit mobile version