విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్..

IMG 20240831 WA0100

 

విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5న తిరుపతిలోని సీఎండి ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నమయ్య జిల్లా సిఐటియు అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.రైల్వే కోడూరు విద్యుత్ ఏడి ఆఫీస్ వద్ద, డిమాండ్లతో కూడిన పోస్టర్లను సిఐటియు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు, విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ కార్మికులను రెగ్యులర్ చేయడం, 2022 పీఆర్సీ ఏరియర్స్ విడుదల చేయడం, ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న అన్ స్కిల్డ్ కార్మికులకు స్కిల్డ్ వేతనాలు ఇవ్వడం, సబ్ స్టేషన్లలో నైట్ వాచ్ మెన్ నియమించడం వంటి డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించారు.ఈ కార్యక్రమంలో, UEEU సబ్ డివిజన్ కార్యదర్శి బి. కుమార్ స్వామి, సహాయ కార్యదర్శి సి. వేణు, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రాజు, అల్లా బకాష్, చంగల్ రాయుడు, గుప్త పార్వతి, ఎస్ పి యం హమాలీలు, పీస్ రేటు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now