*లక్షల డప్పులు వేల గొంతులు గోడ పత్రిక ఆవిష్కరణ*
*
……అబ్రహం మాదిగ
మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు
ప్రశ్న ఆయుధం
సంగారెడ్డి పిబ్రవరి 2: సంగారెడ్డి జిల్లాలోని జహిరాబాద్ పట్టణంలో ఫిబ్రవరి 7న జరిగే లక్ష డప్పులు వేల గొంతులు మహా ప్రదర్శనలో భాగంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అబ్రహం మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ కూడలి వద్ద గోడ పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అబ్రహం మాదిగ మాట్లాడుతూ ఫిబ్రవరి 7న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేపట్టిన లక్ష డప్పులు వేల గొంతులు భారీ సాంస్కృతిక మహా ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జహీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండల భాద్యులు మరియు కార్యవర్గం మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజాస్వామిక వాదులు మనిషికో సంకన డప్పు సద్దిగట్టుకొని పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జహీరాబాద్ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల పక్షాన పిలుపునివ్వడం జరిగింది.
*డప్పుల దాతలు* :-కె మానయ్య గౌడ్,నామకిరణ్ వైశ్య (నామ సుభద్రమ్మ ట్రస్ట్ ),ప్రవీణ్ కుమార్ లింగాయత్, బి ప్రకాష్ రితిన్స్ అకాడమీ, ఎం యిర్మీయా పాస్టర్స్ కాలనీ అధ్యక్షులు, అల్లూరి వంశీరాజ్ దిశా మెంబెర్, ,బెన్నీ లు. ఈ కార్యక్రమంలో..రాంచందర్ మాదిగ ఎం ఇ ఎఫ్ జిల్లా అధ్యక్షులు. ఉల్లాస్ మాదిగ జహీరాబాద్ ఇంచార్జి, నవీన్ మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, జైరాజ్ మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, ఎం రత్నం ఎంజేఫ్ జిల్లా నాయకులు, పద్మారావు ఎం ఎస్ పి జిల్లా సహాయ కార్యదర్శి, కోహిర్, ఝరాసంగం, జహీరాబాద్ మండల అధ్యక్షులు,బి రవికుమార్, మైకల్,టీంకు, ఎమ్మార్పీఎస్ నాయకులు సుకుమార్, సుదీష్ కుమార్, శ్రీనివాస్, సునీల్, రాజు, సురేష్, రాజు జీవన్, నర్సింలు, ప్రవీణ్, దాస్, రాజేందర్, బబ్లు, బాబు, మొచ్చి సంఘం నాయకులు జనార్దన్, విల్సన్, రమేష్,మోహన్ తదితరులు పాల్గొన్నారు