సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఇంద్రేశంలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇంద్రేశంలో ఒకో నిర్మాణానికి మూడు ఫ్లోర్ల అనుమతులు తీసుకొని అక్రమంగా ఐదు, ఆరు ఫ్లోర్లు వేసి ఆకాశానంటేలా నిర్మిస్తుండడంతో అధికారులు కూల్చి వేతలు చేపట్టారు. బుధవారం గ్రామ పంచాయతీ సెక్రటరీ సుభాష్ ఆధ్వర్యంలో ఇంద్రేశంలోని పీఎన్ఆర్ టౌన్ షిప్ లో అక్రమంగా మూడు ఫ్లోర్లకు మించి నిర్మాణాలు చేస్తున్న వాటిని కూల్చి వేస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ సుభాష్ మాట్లాడుతూ.. ఇంద్రేశంలో ఎక్కడైనా అనుమతులకు మించి నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వీరి వెంట కారోబార్ సాయికుమార్, సిబ్బంది ఉన్నారు.
Latest News
