తెలంగాణ ఇంద్రేశం నవ్య సెంట్రల్ కాలనీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత by Donthi Mahesh Published On: November 25, 2024 11:30 am సంగారెడ్డి/పటాన్ చెరు, నవంబరు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో గల నవ్య సెంట్రల్ కాలనీలో అక్రమ నిర్మాణాలను గ్రామ పంచాయతీ సిబ్బంది కూల్చి వేస్తున్నారు. సోమవారం ఉదయం ఇంద్రేశం పరిధిలోని నవ్య కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చి వేస్తున్నారు. ఇంద్రేశం పరిధిలో చాలా వరకు భవనాలు పెద్ద మొత్తంలో కట్టడాలు చేపడుతున్నారు. అయితే అక్రమ నిర్మాణాలపై కాలనీవాసులు ఫిర్యాదులు చేస్తున్నా.. గ్రామపంచాయతీ అధికారులు స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. Post Views: 18